పార్టీ పెట్టను…పోటీ చేస్తా!
సొంతంగా పార్టీ పెట్టే ఆలోచనేది లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సృష్టం చేశారు. రైతుల అభివృద్ది కోసం తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళెంలో జరిగిన రైతు సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ తనకు ఆప్ నుంచి ఆహ్వానం అందిన విషయం వాస్తవమేనని అన్నారు. అయితే ఏ పార్టీలో చేరేది లక్ష్మీనారాయణ చెప్పలేదు. అంతకుముందు రైతు సదస్సులో ప్రసంగిస్తూ, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు పర్యటించి రైతుల కష్టసుఖాలు తెలుసుకున్నానన్నారు. తమిళనాడులో సాధారణ పంటలమీదే ఆధారపడకుండా పట్టు, ఆక్వా, పౌల్ట్రీ, ఉద్వాన వన రంగాల్లోకి వెళ్తున్న రైతులు ఎంతో లాభపడుతున్నారన్నారు. మన రైతులు కూడా ఆ విధంగా ఆలోచించాలన్నారు.













