అంతా చర్చలో పాల్గొనాలి… ఎవరూ గైర్హాజరు కావొద్దు
అసెంబ్లీ సమావేశాలకు ఎవరూ గైర్హాజరు కావొద్దని, చర్చలో అందరూ పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సభలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు. క్వశ్చన్ అవర్ సీరియస్గా జరగాలన్నారు. అనుబంధ ప్రశ్నలతో సమగ్ర చర్చ జరిగేలా చూడాలని తెలిపారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలన్నారు. ప్రతిపక్షం లేదు కాబట్టి ఏదో ఒక సమాధానం ఇచ్చి వెళ్లిపోవడం కాదని, ప్రజలకే తాము జవాబుదారీ అనేది గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ప్రతిపక్షం విధ్వంసక ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్షం లేనందున సభ అర్ధవంతంగా జరుగుతోందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మమనే ముందున్నాం, ఈజ్ ఆఫ్ గివింగ్ సిటిజన్ సర్వీసెస్లోనూ మనమే ముందుండాలని అన్నారు. ఏపీ విభజన చట్టం అములపై కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యంగా ఉందని విమర్శించారు.













