పిఠాపురం లో వంగా గీత ప్రచారం అడ్డుకున్న పోలీసులు..
పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అని ప్రకటించిన తర్వాత ఆ ప్రాంతం ఫోకస్ ఆఫ్ ద టౌన్ గా మారిపోయింది. పవన్ కి ఆపోజిట్ గా వైసీపీ వంగా గీతను ప్రత్యర్థిగా దింపింది. బలమైన పోటీ కనిపిస్తున్న ఈ నియోజకవర్గంలో ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. పిఠాపురంలోని 2,3,4 మున్సిపల్ వార్డు కార్యకర్తలతో కలిసి వంగా గీత ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత వారం రోజులుగా వంగా గీత పిఠాపురంలో జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. పవన్ పై సెటైర్ల వర్షం కురిపిస్తూ.. తాను కూడా కాపు నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని అన్న విషయం అందరికీ గుర్తు చేస్తూ.. పవన్ కాపు కానీ తోపు కాదు.. లాంటి సినిమా డైలాగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈమె ప్రచారానికి ఈరోజు అనుకోకుండా అంతరాయం ఎదురయింది .వంగా గీత ప్రచారాన్ని అడ్డుకున్న పోలీసులు అనుమతి లేకుండా ప్రచారం నిర్వహిస్తున్నారని ఆమెను నిరోధించారు. ప్రచారానికి సంబంధించిన అనుమతి పత్రాలు చూపిస్తేనే ప్రచారం కొనసాగిస్తామని ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారు లు అడిగారు. దీంతో ఆమె అక్కడ నుంచి వెనుతిరిగి వెళ్ళిపోయారు.













