ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ ఎస్ కు ఈసీ షాక్
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితి ( బీఆర్ఎస్) గా మార్చి జాతీయస్థాయిలో విస్తరణ కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలింంది. ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి రాష్ట్ర పార్టీ హోదాను ఉపసంహరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ఎస్ను తెలంగాణలో మాత్రమే రాష్ట్ర పార్టీగా గుర్తిస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొంది. ఎలక్షన్ సింబల్స్ ( రిజర్వేషన్ అండ్ అలాంట్మెంట్ ) ఆర్డర్, 1968లోని పారా 6 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం వల్ల రాష్ట్ర పార్టీ హోదాను కోల్పోయింది.













