పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం : ధర్మాన
సులభతర వాణిజ్యంలో ఆంధప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలబడటం గర్వకారణమని, ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంస్కరణలే కారణమని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సృష్టం చేశారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టి పాదర్శకతతో అనుమతులు మంజూరు చేయటం తమ ప్రభుత్వానికే సాధ్యపడిందన్నారు. నూతన పారిశ్రామిక విధానంలో 187 అంశాలతో ఏపీ పెట్టుబడుల స్వర్గధామంగా నిలుస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పరిశ్రమలకు భూకేటాయింపులు, వాటికి ఆస్తిపన్ను, రికార్డుల డిటిటలైజేషన్, సింగిల్ విండో విధానం దేశానికే ఆదర్శమన్నారు. మంత్రివర్గ సహచరుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం పారిశ్రామికంగా పురోగతి చెందగలదన్నారు. ఈ రంగలో ఏపీ నెంబర్ వన్ స్థానంలోకి వచ్చేందుకు ఆయన కృషి చేశారని ప్రశంసించారు.













