పేర్లు మార్చడం తప్ప వైసీపీ ఉద్దరించింది ఏమైనా ఉందా? : దేవినేని
పోలవరానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శని అని, రాయలసీమ ప్రాజెక్టులను ఆయన నాశనం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు. ఈ సందర్భంగా దేవీనేని మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ముఖ్యమంత్రి ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసిన సంఘం, నెల్లూరు బ్యారేజీలకు తమ పేర్లు పెట్టుకున్నారని విమర్శించారు. ప్రాజెక్టులకు పేర్లు మార్చడం తప్ప వైసీపీ ఉద్దరించింది ఏమైనా ఉందా? అని మండిపడ్డారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో సాగునీటి విషయంలో ఏం చేశామన్న చరిత్ర తమ దగ్గర ఉందన్నారు.













