రూ.2.70 కోట్ల కరెన్సీ నోట్లతో గణపతికి .. ప్రత్యేక అలంకరణ

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా కొలువైన గణనాథుడు పూజలు అందుకుంటున్నారు. పలువురు తమ అభిరుచికి తగినట్లుగా ఏర్పాటు చేసిన మండపాలతో పాటు విభిన్న రూపాల్లో గణపతులను పూజిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువైన పార్వతీపుత్రుడు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాడు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని వాసవీ మార్కెట్‌లో 42వ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. గణపతి ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని రూ.2.70 కోట్ల కరెన్సీతో ప్రత్యేకంగా అలంకరించారు. దీంతో భక్తులు మహాగణపతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలిస్తున్నారు.