గతంలో కాంగ్రెస్ రిటైల్.. ఇపుడు బీజేపీ హోల్‌సేల్‌గా
గతంలో కాంగ్రెస్ పార్టీ రిటైల్‌గా అవినీతి చేస్తే, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ హోల్‌సేల్‌గా అవినీతికి పాల్పడుతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ విమర్శించారు. హైదరాబాద్ మగ్దూంభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడకపోతే ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగం ప్రమాదంలో పడుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు చెందిన ఆస్తులను మోదీ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నదని మండిపడ్డారు. నల్లడబ్బును తెల్లగా మార్చే వ్యవహారంలో బీజేపీకి రూ. రెండున్నర లక్షల కోట్ల షేర్ ఉన్నదని ఆరోపించారు.













