అమరావతి విషయంలో బీజేపీ డ్రామా
అమరావతి విషయంలో బీజేపీ డ్రామాలాడుతోందని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి ఉద్యమం చారిత్రాత్మకమైనదని అన్నారు. వైసీపీ 13 జిల్లాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అమరావతిపై ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతున్నామని తెలిపారు. సోలార్ విద్యుత్ కొనుగోలు విషయంలో వేలకోట్లలో గోల్ మాల్ జరుగుతోందన్న అనుమానం కలుగుతోందన్నారు. 22 రాష్ట్రాలు సోలార్ విద్యుత్ కొనుగొలు తిరస్కరిస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఒక్కరోజులోనే ఆమోదం తెలిపిందని అన్నారు. అదానీతో జగన్ లాలూచీకి ఇదే నిదర్శనమని అన్నారు.













