ఏపీలో కోవిడ్ 19 (Apr 12) కేసుల వివరాలు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కరోనా వైరస్ ఉద్ధ•తి కొనసాగుతోంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు కొత్తగా 22 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో గుంటూరులో 14, నెల్లూరులో 4, కర్నూలులో 2, చిత్తూరు, కడప జిల్లాల్లో ఒక్కోటి ఉన్నాయి. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 427కి పెరిగింది. గుంటూరులో ఒకరి మృతితో రాష్ట్రంలో ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరింది. విజయవాడ జీజీహెచ్ నుంచి 65 ఏళ్ల వృద్ధుడు ఆదివారం డిశ్చార్జి అయ్యారు. దీంతో ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లినవారి సంఖ్య 12కి చేరింది. ఇదిలా ఉండగా గుంటూరు జిల్లాలో రెండు రోజుల్లో 31 కేసులు బయటపడ్డాయి.














