ఏపీలో కోవిడ్ 19 కేసుల వివరాలు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 405కి చేరింది. గుంటూరులో 17, కర్నూలులో 5, ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున కొత్తగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 909 మందికి కొవిడ్-19 పరీక్షలు నిర్వహించగా, అందులో 37 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరుగురు మరణించగా, 11 మంది డిశ్చార్జి అయినట్లు తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 388 ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.














