ఏపీలో భారీగా పెరిగిన కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 36,452 కరోనా పరీక్షలు చేయగా కొత్తగా 1,831 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 242 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,195 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 467, విశాఖ జిల్లాలో 295, కృష్ణా జిల్లాలో 190, గుంటూరు జిల్లాలో 164, అనంతపురం జిల్లాలో 161, తూర్పు గోదావరిలో 84, కడప జిల్లాలో 20, నెల్లూరులో 129, శ్రీకాకుళంలో 122, విజయనగరంలో 40, పశ్చిమ గోదావరిలో 57, ప్రకాశం జిల్లాలో 46, కర్నూలు జిల్లాలో 56 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.