ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 69,088 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 1,535 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో వైరస్ ప్రభావంతో 16 మంది మృతి చెందారు. తాజాగా 2,075 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,55,95,949 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో 19,60,360 మది కరోనా బాధితులు కోలుకున్నారు. కరోనా మహమ్మారి బారినపడి మొత్తం 13,631 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,210 పాజిటివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 19,92,191 మంది కరోనా బారిన పడ్డారు. చిత్తూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున కరోనాతో మృతి చెందారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. గుంటూరు, కడప, విశాఖ జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.







