ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకున్న విశ్వవిద్యాలయాలు, కళాశాలల విద్యార్ధులు
ఫీజు రీ ఇంబర్స్మెంట్ ను రూ.35,000 నుంచి రూ.45,000 కు పెంచినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన విద్యార్ధులు. తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలసిన విద్యార్ధులు. ఫీజు రీ ఇంబర్స్మెంట్ ను రూ.35,000 ను రూ.45,000 గా పెంచినందుకు కృతజ్ఞతలు. రాష్ట్రంలో ఫీజు రీఇంబర్స్మెంట్ పెంపు వల్ల 3 లక్షలమంది విద్యార్ధులకు లబ్ది. ఇందుకు రాష్ట్రప్రభుత్వానికి రూ.300 కోట్ల వ్యయం అవుతుంది. సీఎంను కలసినవారిలో టీఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి, జి. చైతన్య, శ్రావణి, నవీన్ రామకృష్ణ, అజారుద్దీన్ తదితరులు.













