మూడో విడత వైఎస్ఆర్ ఆసరా నిధులు విడుదల
మూడో విడత వైఎస్ఆర్ ఆసరా నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లబ్దిదారుల ఖాతాలో జమ చేశారు. 78.94 లక్షల మంది లబ్దిదారులకు రూ.6.419 కోట్లు విడుదల చేశారు. ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని మాట్లాడారు. మహిళా సాధికారతే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్లోందని స్పష్టం చేశారు. మహిళలపై వడ్డీ భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బ్యాంకులతో మాట్లాడి వడ్డీ శాతం తగ్గిస్తూ వస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం పొదపు సంఘాల పనితీరు ఎలా మారిందో కనిపిస్తోందన్నారు. 91 శాతానికి పైగా సంఘాలు ఏ గ్రేడ్ సంఘాలుగా మార్పుచెందాయని తెలిపారు.













