Municipal Elections; ప్రతి ఓటరూ పోలింగ్ కేంద్రానికి వచ్చేలా చూడాలి : రేవంత్ రెడ్డి
మున్సిపల్ ఎన్నికల్లో (Municipal elections) నేతలు సమన్వయంతో ముందుకెళ్లాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సూచించారు. ఎన్నికల ప్రచారం, ఇతర అంశాలపై కాంగ్రెస్ ముఖ్యనేతలు, మంత్రులతో సీఎం జూమ్ మీటింగ్ నిర్వహించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ స్థితిగతులపై సీఎం రేవంత్ ఆరా తీశారు. బలహీనంగా ఉన్న మున్సిపాలిటీల్లో పోలింగ్ వ్యూహంపై చర్చించారు. స్థానిక నేతల నేతత్వంలో పోల్ మేనేజ్మెంట్ జరిగేలా చూడాలని మంత్రులకు సూచించారు. ప్రతి ఓటరూ పోలింగ్ కేంద్రానికి వచ్చేలా చూడాలన్నారు. ఇవాళ, రేపు ఓటర్లకు నేతలు అందుబాటులో ఉండాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan,), పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});













