జలసిరికి హారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు
నదుల అనుసంధానంలో రాష్ట్రంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలహారతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ను అన్నపూర్ణగా తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర పోషించే నీటి వనరులను పెంచే దిశగా అడుగులు వేస్తున్న సర్కారు జలహారతి కార్యక్రమంలో నదులకున్న ప్రాధాన్యతను వివరిస్తోంది. శారద నదికి హారతి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నర్సాపురం ఆనకట్టను ప్రారంభించారు. అదే విధంగా విశాఖ జిల్లా కసింకోట మండలం నర్సాపురంలో శారద నదికి ముఖ్యమంత్రి చంద్రబాబు జలసిరి హారతి ఇచ్చారు.













