సీఎం వయసు చిన్నది … బాధ్యత పెద్దది : కేసీఆర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం అనంతరం… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి వయసు చిన్నది కానీ, బాధ్యత పెద్దది అన్నారు. బాధ్యతలను అద్భుతంగా నిర్వహించగలగిన శక్తి, సామర్థ్యం ఉందని గత తొమ్మిదేళ్లలో నిరూపించారన్నారు. తండ్రి నుంచి వచ్చిన వారసత్వం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందన్నారు. మీ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి. రెండు రాష్ట్రాల ప్రజలు ఆత్మీయతతో పరసర్పరం సహకరించుకుంటూ అభివృద్ధి చెందాలన్నారు. గోదావరి జలాల వినియోగం వందశాతం జరగాలి. కృష్ణానది నీటి విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. కర్తవ్య నిర్వహణలో సహాయ సహకారాలు, అండదండలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. జగన్కు అద్భుతమైన అవకాశం ప్రజలు ఇచ్చారు. చాలా సంతోషం. మీ నాన్నగారి పేరును నిలబెట్టాలి. మూడు, నాలుగు టర్మ్ల వరకూ మీ పరిపాలన సాగాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని అన్నారు.













