దేశంలోనే 51 శాతం పదవులిచ్చిన రాష్ట్రం ఏపీనే : వైఎస్ జగన్
దేశంలో మహిళలకు 51 శాతం పదవులిచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రతి అక్క, ప్రతీ చెల్లెమ్మకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సభలో స్టేజి మీద, స్టేడియం నిండా, తన చుట్టూ ఉన్న మహిళలంతా ప్రజాప్రతినిధులే అని అన్నారు. మహిళల కోసం చట్టం చేసిన తొలి ప్రభుత్వం మనదేనని అన్నారు. రెండున్నరేళ్లుగా అధికారారాన్ని అక్కచెల్లెమ్మల కోసం వినియోగించామని అన్నారు. రాజకీయ సాధికారత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టులు మహిళలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు.













