Chandrababu: నవంబరు నుంచి సీఎం చంద్రబాబు క్షేత్ర పర్యటన

సంక్షేమ పథకాల అమలు తీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు నవంబరు నుంచి క్షేత్ర పర్యటనలు ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) వ్లెడిరచారు. ప్రభుత్వ సేవల్లో సంతృప్త స్థాయి, ఆర్టీజీఎస్ (RTGS) పనితీరుపై సచివాలయంలో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వన్ గవర్నమెంట్, వన్ సిటిజన్ విధానంతో ప్రజలకు సమర్థంగా సేవలు అందిస్తామన్నారు. దీనిపై వచ్చే నెల మొదటి వారంలో మంత్రులు (Ministers) , కార్యదర్శులు, కలెక్టర్ల పనితీరును మదింపు చేస్తామని తెలిపారు. పాలనలో సుస్థిర విధానాలు అమలు చేస్తున్నాం. జీఎస్టీ (GST) 2.0 సంస్కరణలతో ప్రజలకు ఒనగూరే లబ్ధిపై సినిమా థియేటర్లలో స్లైడ్‌లు ప్రదర్శించాలి. దీనిపై గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు మరింత అవగాహన కల్పించాలి అని పేర్కొన్నారు.