Chandrababu: గత ప్రభుత్వం ట్రూఅప్ … కూటమి ప్రభుత్వం ట్రూడౌన్‌తో

సమర్థ పాలనకు, అసమర్థ పాలనకు ఉన్న తేడాను ప్రజలకు వివరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యే( MLA) లు, ఎంపీ (MP) లు పార్టీ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ (Teleconference) నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. చేసిన పనులు చెబితేనే ప్రజల్లో ప్రభుత్వం పట్ల నమ్మకం పెరుగుతుంది. ప్రజలతో మమేకమే కాదు, మంచి పేరు తెచ్చుకోవాలి. పార్టీకి ప్రజాప్రతినిధులు, నేతలే ప్రతినిధులు. వ్యవహారశైలితో పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి. గత ప్రభుత్వం ట్రూఆప్ పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచింది. కూటమి ప్రభుత్వం ట్రూడౌన్ పేరుతో తగ్గించింది. సోలార్, విండ్ ఛార్జీలను పెంచింది. కూటమి ప్రభుత్వం ట్రౌడ్‌న్ పేరుతో తగ్గించింది. సోలార్, విండ్ సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తిపై దృష్టి పెట్టాం. జీఎస్టీ (GST) సంస్కరణలతో కలిగే లాభాలను ప్రజలకు తెలపాలి. ప్రజలు మనమైపు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కూటమిగా ఉన్నాం. అద్భుత విజయాన్ని కట్టబెట్టారు. అంతమించిన స్థాయిలో మళ్లీ విజయం దక్కేలా కూటమి పార్టీలు బలపడాలి అని అన్నారు.