Chandrababu :తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ : చంద్రబాబు
దేవుడు ఇచ్చిన శక్తితో పార్టీని సమర్థంగా నడిపించేందుకు కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంబ్రాబు (Chandrababu) అన్నారు. మరోసారి జాతీయ అధ్యక్షుడి (National President)గా ఎన్నికైన అనంతరం మహానాడులో పార్టీ శ్రేణులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. నా ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ (TDP) ఉంటుంది. నా బలం, బలగం టీడీపీ. నాపై కార్యకర్తలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. మహానాడు (Mahanadu) లో ఆరు శాసనాలపై అర్థవంతంగా చర్చలు జరిగాయి.
రాబోయే 40 ఏళ్లకు ప్రణాళిక రచించుకున్నాం. నక్సలిజం రూపుమాపడానికి నిరంతరం పోరాడిన పార్టీ టీడీపీ. రాయలసీమలో ఫ్యాక్షనిజం తుదముట్టించి అభివృద్ధికి బాటలు పరిచాం. రాయలసీమ రాళ్ల సీమ కాదు, రత్నాల సీమగా మారుస్తానని చెప్పాం. కోనసీమ కంటే సంపదలో అనంతపురం ముందుండడానికి టీడీపీ కారణం. హైదరాబాద్ (Hyderabad) లో మత ఘర్షణలను పూర్తిగా కట్టడి చేశాం. టీడీపీ అధికారంలో ఉంటే అందరికి రక్షణ ఉంటుంది. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. హంద్రీనీవా కింద చివరి భూములకు నీళ్ల కోసం రూ.3,800 కోట్లు ఖర్చు చేశాం. పోలవరం తర్వాత హంద్రీనీవాకు భారీగా ఖర్చు చేస్తున్నాం. వెలిగొండతో పాటు మిగతా ప్రాజెక్టులను పూర్తి చేస్తాం అని అన్నారు.













