Chandrababu : ఈ ఏడాది నుంచే సూపర్ సిక్స్ అమలు : చంద్రబాబు
ఈ నెల 28న ఉభయ సభల్లో 2025-26 వార్షిక బడ్జెట్ (Budget) ప్రవేశ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో వార్షిక బడ్జెట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్షించారు. ఈ ఏడాది నుంచి సూపర్ సిక్స్ (Super Six) పథకాలు అమలు చేయాలని ఇప్పటికే ప్రకటించినందును బడ్జెట్లో అందుకు తగ్గ కేటాయింపులపై కీలకంగా చర్చించినట్లు తెలుస్తోంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు (Free bus) ప్రయాణం వంటి పథకాల అమలుకు ఈ ఏడాది నుంచే శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అటు పథకాలు, ఇటు అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ బడ్జెట్ కేటాయింపులు చేయడం సర్కార్‌కు సవాల్‌గా మారింది. సవాళ్లను అధిగమించాల్సిన అంశాలపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav), ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













