Chandrababu: పీ-4 అమలుకు సీఎం చంద్రబాబు .. కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీ-4 కార్యక్రమాన్ని విస్తృతం చేసేందుకు పట్టిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నిర్ణయించారు. సీఎం చైర్మన్గా రాష్ట్ర స్థాయి సొసైటీ ఏర్పాటుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. జీరో పావర్టీ, పీ-4 పై నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్గదర్శులను కలెక్టర్లు(, Collectors) , మంత్రులు (Ministers), ఎమ్మెల్యేలు (MLAs) గుర్తించేలా వ్యవస్థను రూపొందించనున్నట్లు సీఎం తెలిపారు. ఆగస్టు 15 నాటికి 5 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా కార్యాచరణ రూపొందించనున్నారు. పీ-4 కోసం మిలాప్ (Milap), డొనేట్ కార్డ్ (Donate Card), రంగ్ దే సంస్థల సహకారం తీసుకోవాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు.













