Chandrababu : కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఢిల్లీలో పర్యటించారు. దీనిలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యారు. తొలుత కేంద్ర పునరుత్పాదక ఇంధనశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి (Prahlad Joshi) తో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) , పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలతో కలిసి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టులు, ప్రధాని సూర్యఘర్ పథకం అమలుపై ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు చర్చించారు. అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh), సీఆర్ పాటిల్ (C.R. Patil) తో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలపై వారితో చర్చించారు.













