కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి గుడ్ బై ?
సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన చిరంజీవి అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నేతగానే కొనసాగుతున్నారు. రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగానూ పని చేశారు. అనంతరం రాష్ట్ర విభజన జరగడం, కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగియగా, దాన్ని పునరుద్ధరించుకోలేదు. దీంతో ఆయన ఆ పార్టీకి దూరమైనట్లేనని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని చిరంజీవిని రాహుల్ గాంధీ, పార్టీ అగ్ర నాయకులు కోరినట్లు తెలుస్తోంది. పార్టీ అగ్రనాయకుల ప్రతిపాదనకు చిరంజీవి స్పందించలేదని సమాచారం. కాంగ్రెస్ పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉండాలని చిరంజీవి నిర్ణయించుకున్నట్లు సమాచారం.













