కరోనా బాధితులకు ప్రభుత్వం అండగా… శ్రీకాంత్ రెడ్డి
కరోనా బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందని అన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి సహకారంతో రాయచోటి ఏరియా ఆస్పత్రికి మరో 10 ఆక్సిజనేటర్లు అందాయని అన్నారు. కోవిడ్ బాధితులకు సహాయంలో మిథున్‌రెడ్డి కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలిస్తోందని, లాగే 100 పడకల ఆస్పత్రి అభివృద్ధి నిర్మాణ పనులు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు.













