పార్టీల అధినేతలకు, ఎంపీలకు చంద్రబాబు లేఖ
లోక్‌సభలో రేపు అవిశ్వాసంపై చర్చ జరుగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ పార్టీల అధినేతలు, ఎంపీలకు లేఖ రాశారు. అవిశ్వాసానికి తీర్మానానికి మద్దతివ్వాలని లేఖలో ముఖ్యమంత్రి కోరారు. ఏపీ ప్రయోజనాల కోసం పోరాడుతున్న టీడీపీకి మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా, పోలవరం, రెవెన్యూలోటు, రైల్వేజోన్, స్టీల్‌ప్లాంట్, అమరావతి, వెనుకబడిన జిల్లాలకు నిధుల అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. రాజ్యసభలో నాటి ప్రధాని హామీలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నాడు హోదా కోసం పట్టుబడిన బీజేపీ నేతలు ఇవాళ వెనక్కి వెళ్లారని తెలిపారు. పునర్విభజన చట్టాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.













