టీడీపీ అధికారంలోకి రాగాగే ఉచితం : చంద్రబాబు
ఓటీఎస్ ఎవరూ కట్టొదని, టీడీపీ అధికారంలోకి రాగానే ఉచితం చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కుప్పంలోని దేవరాజపురంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో కోవర్ట్లు ఉంటే తప్పుకోండి ప్రతి పల్లె తిరుగుతూ అన్ని ప్రక్షాళన చేస్తానని ప్రకటించారు. అసెంబ్లీలో వైసీపీ తనను ఎంతగానో అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో 2019 నుంచి అరాచక పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఇన్ని ఇబ్బందులు, అరాచకాలు ఎప్పుడూ చూడలేదని, అన్ని రకాల ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. ప్రజలను జగన్ రెడ్డి ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని మండిపడ్డారు.
దోచుకున్న డబ్బులను ఓటర్లకు వేలకు వేలు పంచి పెట్టారని ఆరోపించారు. టీడీపీ అలా అనుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. సీఎం జగన్ హుందాగా వ్యవహరించాలని హెచ్చరించారు. తన కార్యకర్తపై దెబ్బ పడిరదంటే అది తనమీద పడినట్టేనని తెలిపారు. తాను ఎవరినీ వదలి పెట్టానని హెచ్చరించారు. వైసీపీ ఒకింత ఇబ్బందులు పెడితే తాను పదింతలు ఇబ్బందులు పేడతానని తెలిపారు. తాను కుప్పంను సరిచేస్తాను కానీ వదలి పెట్టానని హెచ్చరించారు.













