Mahanadu : మహానాడు విజవయవంతం : సీఎం చంద్రబాబు
కడపలో మహానాడు (Mahanadu) అద్భుతంగా జరిగిందని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. జిల్లా నాయకత్వమంతా కలిసి పనిచేసి విజయవంతం చేశారని తెలిపారు. ఇందుకు కృషి చేసిన నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. సమష్టిగా చేస్తే ఏదైనా సాధ్యమని మహానాడుతో నిరూపితమైందన్నారు. మంత్రులంతా (Ministers) కార్యకర్తల్లాగా పనిచేసి స్ఫూర్తినిచ్చారని పేర్కొన్నారు. మహానాడులో ప్రవేశపెట్టిన ఆరు శాసనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నాం. ప్రభుత్వ పథకాలు (Government schemes) , అభివృద్ధి కార్యక్రమాలు, పాలనపై ప్రజల్లో సానుకూలత ఉంది. ఎమ్మెల్యేలు (MLAs) కూడా విధిగా పేదల సేవలో పాల్గొనాలి. ప్రతిక్కరికీ సంక్షేమం అందేలా సంక్షేమ క్యాలెండర్ (Calendar)ను ప్రకటిస్తాం అని తెలిపారు.













