టీడీపీ టికెట్లు అమ్ముకుంటుంది.. రమేశ్ కుమార్
ఆంధ్రాలో ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో టికెట్లు రాని నేతలు తమ సహనాన్ని పబ్లిక్ గానే ప్రదర్శిస్తున్నారు. అలా టీడీపీ నుంచి టికెట్ రాకపోవడంతో వైసిపికి పైనమయ్యారు రమేష్ కుమార్. మాజీ ఎమ్మెల్యే ,అన్నమయ్య జిల్లా రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి రమేష్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. రేపు జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపి తీర్థం పుచ్చుకోనున్నారు. రాజీనామా సందర్భంగా టీడీపీ గురించి ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తన దృష్టిలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు సేవ చేసే పార్టీ కాదని.. కేవలం డబ్బుల కోసం చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. అందుకే ఆ విధానాలు నచ్చక పార్టీకి రాజీనామా చేసి వైసీపీ లో చేరబోతున్నట్లు ఆయన ప్రకటించారు.













