వైసీపీ ప్రభుత్వానికి చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్…టీడీపీ హయాంలో 72 శాతం
పోలవరం ప్రాజెక్టు నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు తొలిసారి పోలవరంలో పర్యటించారు. పోలవరం ప్రాజెక్టు డ్యామ్‌పై ఇవతలి నుంచి అవతలి గట్టు వరకు 1.8 కి.మీ కాలినడక పనులను పరిశీలించారు. కుంగిన గైడ్ బండ్‌నూ సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 72 శాతం పనులు పూర్తి చేశామన్నారు. జగన్ ప్రభుత్వం ఎంత శాతం పనులు పూర్తి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి. అసమర్థ పరిపాలన వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. డయాఫ్రల్ వాల్ కొత్తది కట్టాలా? మరమ్మతులు చేస్తారా? చూడాలి. మరమ్మతులు చేస్తే 85 మీటర్లు లోపలికి వెళ్లాళి. పోలవరం సున్నితమైన ప్రాజెక్టు, ప్రమాదకరమైన ప్రాజెక్టు దీనిని మనం కాపాడుకోవాలి. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టుపై 83 సార్లు సమీక్ష చేశా. పోలవరం ఎత్తు 41.15 మీటర్లు ఉంచాలని జగన్ ప్రభుత్వానికి ఎందుకు అనిపించింది? అని ప్రశ్నించారు.













