వైసీపీ విధ్వంసాలపై చర్యలు తీసుకోవాలి : చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వారి ఆస్తులపై వైసీపీ వరుస దాడులు, విధ్వంసాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై డీజీపీతో చంద్రబాబు మాట్లాడారు. పోలింగ్ తర్వాత ప్రణాళికాబద్ధంగా మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. మాచర్లలో వందలమంది ప్రైవేటు సైన్యంతో జరుపుతున్న దాడులను అరికట్టడానికి అదనపు బలగాలను పంపాలని కోరారు. అన్ని గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని, దాడులకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేయూలని విజ్ఞప్తి చేశారు. అనేక జిల్లాల్లో పోలింగ్ అనంతరం జరుగుతున్న దాడులను ప్రస్తావించి, శాంతిభద్రతల పరిరక్షణకు తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.













