Koneru Hampi : కోనేరు హంపిపై సీఎం చంద్రబాబు ప్రశంసలు
అంతర్జాతీయ వేదికపై కోనేరు హంపి (Koneru Hampi) మరింత ప్రకాశించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆకాంక్షించారు. ఫీడే వరల్డ్ కప్ సెమీఫైనల్స్ (FIDE World Cup Semifinals) కు చేరిన తొలి భారత మహిళగా ఆమె అరుదైన రికార్డు (Record) సాధించారని అభినందించారు. హంపి సాధించిన విజయం పట్ల గర్వంగా ఉందన్నారు. ఇది కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, భారతీయ చెస్ (Chess)కు గర్వకారణమైన క్షణం అని వెల్లడిరచారు. దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని వ్యాఖ్యానించారు. టైటిల్ (Title)ను ఇంటికి తీసుకురావాలని కోరారు. చెస్ క్రీడాకారిణి, గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తోంది. గత ఏడాది ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌గా నిలిచిన ఆమె, ఇప్పుడు ఫిడే మహిళల చెస్ ప్రపంచక కప్ సెమీఫైనల్ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.













