పోలవరం నిర్వాసితులను సీఎం జగన్ మోసం : చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను మోసం చేసిన దుర్మార్గుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై చంద్రబాబు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నాలుగేళ్లలో ఏ ఒక్కరికీ పరిహారం అందకపోగా లబ్దిదారుల జాబితాలో మార్పులు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పట్టిసీమతో సమానంగా ఎకరానికి రూ.19 లక్షలు పరిహారం ఇస్తానన్న హామీ ఏమైందని జగన్‌ను నిలదీశారు. పోలవరం నిర్వాసితులకు కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో తెలుగుదేశం ప్రభుత్వం పునరావాసం కల్పించిందని గుర్తు చేశారు. శరవేగంగా ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పరిధిలో కొత్తగా ఒక్క కట్టడమా జగన్మోహన్ రెడ్డి చేపట్టలేదని విమర్శించారు. ఇంకా 214 కట్టడాలు కట్టాల్సి ఉండగా, 50 శాతం కనెక్టివిటీ పనులు పెండిరగ్‌లోనే ఉన్నాయన్నారు. విశాఖ పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి సుమారు 23 టీఎంసీల నీటిని సరఫరా చేయాలని నిర్ణయిస్తే. ఆ నిర్ణయాన్ని వైసీపీ అటకెక్కించిందని విమర్శించారు.













