మరోసారి అధ్యక్షుడిగా చంద్రబాబు..!
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం మహానాడులో నోటిఫికేషన్ జారీచేశారు. అదివారం మధ్యాహ్నం వరకు నామినేషన్ దాఖలుకు గడువు ఇచ్చారు. నామినేషన్లను ఉపసంహరణ గడువు అదివారం సాయంత్రంతో ముగిసింది. 33 సెట్లు నామినేషన్లు దాఖలైనట్లుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇ.పెద్దిరెడ్డి ప్రకటించారు. అయితే చంద్రబాబుకు మద్దతుగానే ఇవన్నీ దాఖలైనట్లుగా సమాచారం. ఫలితంగా మరోసారి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నికైనట్టే. మహానాడు చివరి రోజు అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారు. దీంతో రెండోసారి చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికకానున్నారు.













