తప్పుడు సర్వేలతో బ్లాక్ మెయిల్ రాజకీయాలు : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో తప్పుడు సర్వేలతో ప్రజలను మభ్యపెడుతూ వైసీపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఎన్టీఆర్ భవన్లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. తన 45 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఇలాంటి అమానుషమైన, పనికిమాలిన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. రాజకీయ కక్ష సాధిస్తూ ఎక్కడికక్కడ విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో నూటికి నూరు శాతం చిత్తుచిత్తుగా వైసీపీ ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
జగన్ పని అయిపోంది. మరో ఆరు నెలల్లో ఇంటికి పోవడం ఖాయం. జగన్‌ను చూసి ప్రజాస్వామ్యం సిగ్గుపడుతోంది. జగన్‌ను భరించే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు. దేవుడు స్క్రిప్ట్ తిరగరాశాడు. అదే వైసీపీ పతనం. ప్రజల్లో మమేకమై వైసీపీ ఆగడాలు అరికడతాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఓటర్లు టీడీపీ వైపే ఉన్నారు. ఇండియాటూడే ఓటర్ సర్వే ప్రకారం రానున్న ఎన్నికల్లో టీడీపీకి 15 ఎంపీ స్థానాలు రావడం ఖాయం. సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్‌గా తెలుగుదేశం పార్టీ నిలిచింది. నాలుగున్నర ఏళ్లలో ఏం నష్టపోయామో ప్రజలకు చెప్పాలి. టీటీడీ బోర్డు సభ్యులుగా నేరగాళ్లకు స్థానం కల్పిస్తారా? జగన్ మళ్లీ వస్తే రాష్ట్ర పరిస్థితి ఏంటో ప్రజలకు వివరించాలి అని నేతలకు సూచించారు.













