Chandrababu : కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) భేటీ అయ్యారు. దావోస్ (Davos)ప్రపంచ ఆర్థికవేదిక సదస్సు పర్యటన నుంచి ఆయన నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. నార్త్‌బ్లాక్‌లోని ఆర్థికశాఖ కార్యాలయంలో నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman )తో సమావేశమయ్యారు. సుమారు 45 నిమిషాలపాటు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రానికి ఆర్థిక సహకారంపై సీఎం చర్చించారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్రం తరపున విజ్ఞప్తులను ఆమె ముందుంచారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ (Vizag Steel Plant )కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు, పోలవరం ప్రాజెక్టు(Polavaram Project )కు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి సీఎం ప్రస్తావించినట్లు సమాచారం.













