Chandrababu: కేంద్రమంత్రి శివరాజ్ ను ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నివాసానికి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) చేరుకున్నారు. తన నివాసానికి రావాల్సిందిన కేంద్రమంత్రిని సీఎం ఆహ్వానించారు. ఈ మేరకు సీఎం నివాసానికి చేరుకున్ని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ అల్పాహార విందులో పాల్గొన్నారు. అనంతరం ఇరువురు కలిసి అమరావతి (Amaravati)కి బయలుదేరారు. రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో మాజీ ప్రధాని వాజ్‌పేయ్ కాంస్య విగ్రహాన్ని సీఎం, కేంద్రమంత్రి ఆవిష్కరించారు. అక్కడే వాజ్‌పేయి స్మృతి వనం ఏర్పాటుకు ప్రభుత్వం భూమిని కేటాయించిన విషయం తెలిసిందే.






