దిశ చట్టం అసలు అమల్లో ఉందా?
ముస్లిం బాలికపై వైసీపీ యువకుల అత్యాచారాయత్నాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బాధితులను బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ అరాచక మూకలకు ఇంత ధైర్యం ఇచ్చింది ఎవరు అని ప్రశ్నించారు. 16 ఏళ్ల దళిత మైనర్ బాలికపై 12 మంది గ్యాంప్ రేప్ చేసి పోలీస్స్టేషన్ ముందే వదిలేసిన దుర్ఘటన కళ్లముందే ఉందన్నారు. కర్నూలులో గిరిజన మహిళలను భర్త కళ్లముందే అతిదారుణంగా గ్యాంప్ రేప్ చేశారని మండిపడ్డారు. దిశ చట్టం అసలు అమల్లో ఉందా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా పోలీసులు నిద్రమత్తు వీడి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.













