Vajpayee: వాజ్ పేయీ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు, శివరాజ్ సింగ్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని వాజ్ పేయీ (Vajpayee) విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) ఆవిష్కరించారు. వాజ్పేయీ జయంతిని పురస్కరించుకుని వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన 13 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar), భూపతిరాజు శ్రీనివాసవర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు.






