అసెంబ్లీ సీట్ల పెంపునకు అంతా సిద్ధం?
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోది. దీనిపై రాజకీయ నిర్ణయమే తరువాయి అన్న సంకేతాలు వెలువడ్డాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనడానికి ఢిల్లీకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు మంత్రులతో భేటీ అయ్యారు. అసెంబ్లీ సీట్ల పెంపు గురించి రాజ్నాత్ సింగ్తో మాట్లాడారు. ఈ సందర్భంగా అంతా సిద్ధంగా ఉందని, ప్రధాని, బీజేపీ అధ్యక్షుడితో మాట్లాడి రాజకీయ నిర్ణయం తీసుకునే దిశగా ప్రయత్నించాలని చంద్రబాబుకు రాజ్నాథ్ సూచించనట్లు సమాచారం. దీనిపై చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో తాము గట్టిగా ఉన్నామని, అటు ప్రధానమంత్రి, ఇటు అమిత్ షాతో మాట్లాడతామని తెలిపారు. అది అవుతుందని నమ్ముతున్నారా? అని విలేకరులు అడిగినప్పుడు రాజకీయాల్లో ఫాలో అప్ చేయడం అవసరం. ఎట్టి పరిస్థితుల్లోనైనా సాధించుకోవడానికి అన్ని విధాలుగా కృషి చేస్తాం అని సృష్టం చేశారు.













