ఏపీకి కేంద్రం షాక్.. ఒక్క రాజధానికే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఒక్క రాజధానికే నిధులిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన అంశాలపై ఈ నెల 27న కేంద్ర హోంశాఖ సమావేశం కానుంది. విభజన చట్టం ప్రకారం రాజధానికి కేంద్రం సహకారంపై సమావేశంలో చర్చించనున్నారు. కొత్త రాజధానికి నిధులు అని మాత్రమే కేంద్ర హోంశాఖ అజెండాలో తెలిపింది. మూడు రాజధానులపై అజెండాలో ప్రస్తావనే లేదు. పదే పదే మూడు రాజధానులని చెబుతున్న జగన్ మోహన్ రెడ్డికి కేంద్రం షాకిచ్చిందనే చెప్పవచ్చు. గతంలో ఏపీ హైకోర్టు రాజధానిగా అమరావతే ఉంటుందని తీర్పు ఇచ్చినప్పటికీ ఈ నెలలో ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులకు సంబంధించి బిల్లు పెడతామని చెబుతున్న సీఎం జగన్కు కేంద్రం షాకిచ్చింది.













