Bunny Vasu: ఉన్న పొగ చాలు.. కొత్తవెందుకు సార్?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) రీసెంట్ గా బ్రహ్మానందం(Brahmanandam) ఫోటోతో పాటూ నెల్లూరు పెద్దా రెడ్డి తాలూకా అనే టీ షర్టు వేసుకుని కనిపించడంతో ఓ మీడియా వ్యక్తి దానిపై సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. అల్లు అర్జున్ లో సోషల్ మీడియాలో ఎలా అటెన్షన్ తెచ్చుకోవాలో బాగా తెలుసని ట్వీట్ వేయగా, దానిపై అల్లు అర్జున్ అత్యంత సన్నిహితుడు, నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu) రెస్పాండ్ అయ్యాడు.
అందరూ గర్వించదగ్గ బ్రహ్మానందం లాంటి కమెడియన్ పై బన్నీ తన అభిమానం చూపించడం తప్పైపోయిందా? దాన్ని ఇలా కామెంట్ చేయాలా సార్ అని మొదలుపెట్టిన బన్నీ వాసు, ఈ టీ షర్టు వేసుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. వీలైతే గొడవలు ఆపుదాం, మంచి విషయాలను పాజిటివ్ గా చెబుదామని బన్నీ వాసు అన్నాడు.
చిరంజీవి(Chiranjeevi) గారు నాకు స్పూర్తినిచ్చిన మనిషి అని ఎంతో గొప్పగా నిన్ననే ఓ జాతీయ వేదిక మీద బన్నీ ఎంతో గొప్పగా మాట్లాడారు. ఆ వీడియో మీ నాలెడ్జ్ లోకి రాలేదనుకుంటా. అలాంటివి మీరు పట్టించుకోరు, అలాంటి వీడియోలను హైలైట్ చేస్తే పాజిటివ్ గా కనిపించి, మంచి జరుగుతుందని, ఇప్పటికే ఉన్న పొగ చాలు, ఇంకా కొత్తవెందుకు సార్ అంటూ ఆ జర్నలిస్ట్ ను అడిగాడు బన్నీ వాసు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బన్నీ వాసు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
https://x.com/TheBunnyVas/status/1918565231879413961













