ఉత్తరాంధ్ర భూకాసురుడు ఎవరో దేశం మొత్తం తెలుసు

ఉత్తరాంధ్ర భూకాసురుడు ఎవరో దేశం మొత్తం తెలుసని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. మీది కుల పార్టీనా? మాది కుల పార్టీనా తేల్చుకుందాం రా అంటూ సవాల్ విసిరారు. బీసీల పార్టీ అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుండాలన్నారు. బీసీలకు ఇచ్చే పథకాలను జగన్ రద్దు చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. జగన్ అవినీతిలో భాగమై జైలుకెళ్లినందుకే రాజ్యసభ సీటు వచ్చిందన్నారు. రాష్ట్రంలో లక్షలాది మందికి పని లేకుండా చేసి ఘనుడు జగన్ అని మండిపడ్డారు. ఇప్పుడు జామ్ మేళా అంటూ జగన్నాటకం మొదలు పెట్టారన్నారు. చెప్పింది చేసేవారికే జగన్ మంత్రి పదవులిచ్చారని విమర్శించారు.











































































