మంత్రులు తప్పుడు ప్రచారం : బొప్పరాజు
చర్చలకు రాలేదని మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల రిలే నిరాహార దీక్షకు బొప్పరాజు వెంకటేశ్వర్లు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలో విజయవాడ చూశాకైనా ప్రభుత్వం నిర్ణయం మారాలని అన్నారు. తొమ్మిది మంది నేతలు చర్చలకు వెళ్లి డిమాండ్లను చెప్పి వచ్చామని తెలిపారు. మా డిమాండ్లకు ప్రభుత్వం లిఖితపూర్వకంగా జవాబు ఇవ్వాలని కోరారు. జీవోలు శాస్త్రీయంగా లేవని మీరే చెప్పారు. వాటిని సరిద్దిద్దాలని డిమాండ్ చేశారు. అన్నింటికీ సిద్ధపడే ఆందోళనకు దిగమని, ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం చిత్తుశుద్ధితో అడుగు ముందుకేస్తే తాము నాలుగు అడుగులు వేస్తామని తెలిపారు. ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం తేవొద్దని పేర్కొన్నారు.













