రాజకీయాలకు బండ్ల గణేశ్ గుడ్ బై
సినీ నటుడు, నిర్మాత కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండ్ల గణేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత కారణాల వల్ల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా తాను చేసిన విమర్శలు, వ్యాఖ్యల వల్ల ఎవరినైనా బాధపడి ఉంటే పెద్ద మనసుతో క్షమింమని బండ్ల గణేష్ కోరారు. రాజకీయాల్లోకి అవకాశం కల్పించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి బండ్ల కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్లే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక నుంచి తాను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదని పేర్కొన్నారు.













