అక్రమ అరెస్టులకు భయపడేది లేదు.. ప్రజా క్షేత్రంలోనే : బాలకృష్ణ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఖండించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టు దుర్మార్గమన్నారు. ప్రజా సంక్షేమాన్ని జగన్ గాలికొదిలేసి, ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపులకే పరిమితమయ్యారని మండిపడ్డారు. చంద్రబాబును ఎలాగైనా జైల్లో ఉంచాలనేదే సీఎం జగన్ కుట్ర అని దుయ్యబట్టారు. ఆధారాలు లేకుండా ఏ చట్టం ప్రకారం చంద్రబాబును అరెస్టు చేశారని నిలదీశారు. నిజంగా అనినీతి జరిగి ఉంటే ఇంతవరకు ఛార్జిషీట్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. న్యాయపోరాటం చేసి ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు.













