ఎన్నికల సమయంలో అవినాష్ రెడ్డికి ఊరట ఇచ్చిన తెలంగాణ హైకోర్టు..

ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో కడప వైసీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి ప్రతిపక్షాలు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసులో బెయిల్ పై ఉన్న అవినాష్ రెడ్డి బెయిల్ కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయనకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈరోజు విచారణ జరిపిన కోర్టు పిటిషన్ ను కొట్టివేసింది. అంతేకాదు వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అనుమానితుడే కానీ నిందితుడు కాదు.. నేరం పూర్తిగా రుజువు అయ్యేటంతవరకు.. అది కూడా కేసు దర్యాప్తులో ఉన్నప్పుడు పదేపదే అతనిపై నిందలు వేయడం చేసిన ప్రత్యర్థి బ్యాచ్ కి ఇది పెద్ద షాక్. ఇటువంటి మాటలు మాట్లాడకూడదని.. ఎన్నికల ప్రచారం జరిగే సమయంలో వివేకా హత్య గురించి ప్రస్తావన ఉండకూడదని కడప కోర్టు రీసెంట్ గా ఉత్తర్వులు ఇచ్చింది. అయినా సరే ఎవరు తగ్గకుండా పరోక్షంగా వివేకా హత్య కేసు గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అవినాష్ పై వీరు జరిపే కుట్రలో భాగమే కేసులో ప్రధాన నిందితుడు.. అప్రూవర్ దస్తగిరి తో అవినాష్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేయించడం. ఇప్పుడు అవినాష్ బెయిల్ రద్దు కోసం పెట్టిన పిటిషన్ రద్దు కావడం అతనికి కొంత ఊరట కలిగిస్తుంది.