Agniveer Murali Nayak: వీరజవాన్ కుటుంబాన్ని పరామర్శించే టైం కూడా లేని కాంగ్రెస్ నేతలు.. నేటిజండ్ల విమర్శలు..
అగ్నివీర్ మురళీ నాయక్ (Agniveer Murali Nayak) వీరోచితంగా ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనను రాష్ట్రం మొత్తం దిగ్భ్రాంతికి గురి చేసింది . జమ్ముకశ్మీర్‌లోని (Jammu and Kashmir) రాజౌరిలో పాక్ ఉగ్రవాదుల(Pak Terrorists) కాల్పుల్లో బలైన మురళీ మృత్యువు ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేసింది. ఎంతో పేద కుటుంబానికి చెందిన మురళీ చిన్ననాటి నుంచి దేశ సేవ చేయాలని కలలు కన్నాడు. కానీ అతి చిన్న వయసులోనే తాను ఎన్నుకున్న దేశ సేవే అతని ప్రాణాలను బలి తీసుకుంది. ఈ వార్త తెలిసిన రోజు నుంచి రాష్ట్ర ప్రజలు ఆయన కుటుంబానికి మద్దతుగా నిలిచారు. మురళీ తల్లి జ్యోతి బాయి గుండెలు పిండేసేలా విలపిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరు ఆమెను ఓదార్చేందుకు ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించి భరోసా అందజేశారు.
వైసీపీకి (YCP) చెందిన నేతలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ (Usha Sricharan) , ప్రస్తుత మంత్రి సవిత (Minister Savitha) మురళీ కుటుంబాన్ని సందర్శించి, రాజకీయాలకతీతంగా సానుభూతి వ్యక్తం చేశారు. వారికి భరోసానిచ్చారు. అంతేగాక, స్వయంగా మురళీ తల్లిదండ్రులతో మమకారంగా మెలిగి, వాళ్ల కష్టాలను నెమ్మదింపజేయాలని ప్రయత్నించారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి, వాళ్లకు మద్దతుగా ఉన్నారు. వీరి చర్యలపై ప్రజలు ప్రశంసలు కురిపించారు.
కానీ ఇక్కడే రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్‌గా (Congress PCC chief) ఉన్న వైఎస్ షర్మిల (YS.Sharmila) ఈ విషయంలో ఎక్కడ కనిపించలేదు. ఆమె గతంలో చేసిన హామీలు, మాటలు ప్రజల జ్ఞాపకాల్లో ఉన్నవే. గత ఏడాది ఎన్నికల సమయంలో షర్మిల “మహిళల కష్టాలను నా కష్టాలుగా భావిస్తాను”, “వారి కన్నీళ్లను తుడుస్తాను” అంటూ ఆమె చెప్పిన మాటలు మరువలేం. అయితే ఇప్పుడు నిజంగా ఒక తల్లి కుమారుడి మృతితో ఆవేదన చెందుతుంటే ఆమె కనీసం ఓదార్పు మాట కూడా చెప్పకపోవడం నెటిజన్ల ప్రశ్నలకు దారితీస్తోంది.
మరోవైపు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర నేతలు కూడా మురళీ కుటుంబాన్ని పరామర్శించలేదన్నది మరొక విమర్శ. ఇటువంటి సమయంలో పార్టీలు, పదవులు లెక్కచేయకుండా బాధిత కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత నాయకులపై ఉంటుంది. మంత్రి సవిత చేసిన విధంగా షర్మిల కనీసం ఓసారి ఆ కుటుంబాన్ని కలిసి మాట్లాడినా గౌరవం ఉండేది. ఈ పరిస్థితుల్లో షర్మిల నుంచి స్పందన రావాలన్నది సామాన్యుల ఆకాంక్ష. రాజకీయాలకు అతీతంగా, ఒక మహిళా నాయకురాలిగా ఆమె బాధిత కుటుంబానికి భరోసానివ్వాలని ప్రజలు కోరుతున్నారు.













